శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (11:51 IST)

ప్రకృతిని ఆస్వాదిస్తున్న పునర్నవి.. బీచ్‌లో బ్లూ కలర్ డ్రెస్సులో..

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ పునర్నవి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి.. పార్టీలంటూ, పబ్‌లంటూ తిరుగుతోంది. అయితే ప్రస్తుతం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

బిగ్ హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పావురాలుగా గుర్తింపు తెచ్చుకుంది. మూడు వారాల ముందే హౌజ్ నుండే ఎలిమినేట్ అయిన పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. 
 
ఈ పోస్ట్‌లో.. ఎమోషన్‌గా రాస్తూ.. ఈ జీవితం తనకు చాలా ఇచ్చిందని.. చాలా హ్యపీ అంటూ.. కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా బీచ్‌లో ఏకాంతంగా కూర్చోని.. బ్లూ డ్రెస్‌లో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం 'సైకిల్', 'చిన్న విరామం' సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు సమాచారం.