1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. సముద్రంలో బల్లులు చూసారా?

Lizard,Ocean, Vegetarian | సముద్రంలో బల్లులు చూసారా?

బల్లులు
ఇళ్లల్లో గది గోడల మీద బల్లులు ఉండడం చూసాము. కానీ సముద్రంలో కూడా బల్లులు ఉంటాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కదూ! నిజంగా సముద్రంలో జీవిస్తున్న బల్లి జాతి ఒకే ఒకటి ఉంది. అదే 'మెరైన్' ఇగువానా. దాని శాస్త్రీయ నామం 'ఆంబ్లిరైంఖస్ క్రిస్టేటస్'.

ఇది గెలాపెగాస్ దీవుల్లో నివసిస్తుంది. చూడడానికి నల్లగా భయంకరంగా కనిపిస్తుంది కాని పట్టుకుంటే మాత్రం మెత్తగా ఉంటుందట. ఈ బల్లులు శాకాహారులు. సముద్రపు అడుగు భాగంలో ఉండే నాచు మొక్కలను తింటాయి. సముద్రపు నీటిలో బతకడానికి వీలుగా వాటి శరీరాకృతి ఉంటుంది. వీటిలో ప్రత్యేకమైన ఉప్పు గ్రంథులు ఉంటాయి.

ఆ గ్రంథులు ముక్కు రంధ్రాల ద్వారా బ్రైస్ అనే ఉప్పు నీటి ద్రవాన్ని విడుదల చేస్తుంటాయి. దానివల్లే అవి సముద్రపు నీటిలో మునగగలుగుతాయి. ఈ మెరైన్ ఇగువానాలు సుమారు నాలుగు అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. అవి ఉండే దీవిని బట్టి వాటి పరిమాణం, రంగు మారుతూ ఉంటాయి. వీటిలో మగ జీవులు 3.5 కిలో గ్రాముల వరకు పెరుగుతాయి.
About Writer
xx