1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Low Pressure Area system may affect the coastal belt, AP to receive rains

ఏపీకి మరో తుఫాను ముప్పు - ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Rains
ఆర్నబ్, మురసు తుఫానులు సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరోముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడి, ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ఈ నెల 18, 19వ తేదీల నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది. దీని ప్రభావం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
కాగా, ఈ అల్పపీడనం ఏర్పడిన 24 గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతుందని వివరించారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు, ఉత్తర కోస్తాంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయ్ మూడు రోజుల పాటు పొడి వాతావరణే ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత అల్పపీడనం కదలికను బట్ట వర్షాల పరస్థితులపై వచ్చే అవకాశం ఉంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాప్తాడు నిందితుడు కేసు, కట్ చేసిన అతడి కాలును భద్రపరచండి: హైకోర్టు