1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 2027 may not be the year for long weekends. Here's why

2027 సంవత్సరంలో పబ్లిక్ హాలిడేస్ అన్నీ వారాంతంలోనే...

bank holiday
కొత్త సంవత్సరం 2027లో పబ్లిక్ హాలిడేస్ అన్నీ వారాంతంలోనే వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగలనుంది. సాధారణంగా కొత్త యేడాది క్యాలెండర్ వచ్చిందంటే ముందుగా చూసేది పబ్లిక్ హాలిడేస్ ఏయే వారాల్లో వచ్చాయని చూస్తాం. 
 
సాధారణంగా పబ్లిక్ హాలిడేస్ సోమవారం లేదా శుక్రవారం సెలవు వస్తే, వారాంతపు సెలవులతో కలుపుకొని మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ లభిస్తుంది. దీంతో ఉద్యోగులు విహార యాత్రలు, సొంత ఊళ్లకు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. అయితే, 2027లో ఈ అవకాశాలు గణనీయంగా తగ్గనున్నాయి.
 
ఈ సెలవుల జాబితాతో కూడిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఆన్‌లైనులో చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఉద్యోగులు 2027ని 'సవాలుతో కూడిన సంవత్సరం'గా అభివర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
 
అయితే, ఈ ప్రభావం ప్రధానంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసే ఉద్యోగులపైనే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వారాంతాల్లో పబ్లిక్ హాలిడే వస్తే, దానికి బదులుగా మరో రోజు కాంపెన్సేటరీ సెలవును ఇచ్చే విధానాన్ని పాటిస్తుంటాయి.
 
కానీ, అన్ని కంపెనీలలో ఈ వెసులుబాటు ఉండదు. మొత్తం మీద 2027లో ఉద్యోగులు తమ ట్రిప్స్ కోసం వ్యక్తిగత సెలవులను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రార్థన చేసుకుంటానని నమ్మంచి వెనుక నుంచి దాడి చేశాడు : ఫ్లైదుబాయ్ కెప్టెన్