సంబంధిత వార్తలు
- సోనూ భాయ్! మీరు చాలా గ్రేట్... మరో రెండు రైళ్లలో వలస కార్మికులను తరలించిన రియల్ హీరో
- రోగుల పట్ల కవిత ఔదార్యం
- నయీం కేసులో ఎందుకంత ఉదారత? ... కేసీఆర్ పై రాములమ్మ సంచలన కామెంట్స్
- కాన్పూర్ బ్రేకింగ్ న్యూస్: గ్యాంగ్స్టర్ వికాస్ దూబె తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం
- వరుడు ఒకరు - ఇద్దరు వధువులు - ఒకే ముహుర్తానికి జరిగిన పెళ్లి!!
సోనూ సూద్ మరో ఉదారత.. 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం
రియల్ హీరో సినీనటుడు సోనూ సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లాక్‌డౌన్ సంక్షోభంతో వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు. తాజాగా, లాక్ డౌన్ సమయంలో మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నాననీ, అది తన బాధ్యతగా భావిస్తునని సోనూసూద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు.
కాగా, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూసూద్ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. వారికోసం బస్సుల దగ్గర నుంచి చార్టర్డ్ విమానాల వరకు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
