రోగుల పట్ల కవిత ఔదార్యం

kavitha
ఎం|
నిజామాబాద్ మాజీ ఎంపీ, తెరాస నాయకురాలు నిజామాబాదు పెద్దాసుపత్రిలో పేద రోగుల కోసం ప్రారంభించిన అన్నదాన కార్యక్రమానికి రెండేళ్లు నిండాయి.

2017 నవంబరు 8 న కవిత ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ ఆస్పత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తుంటారు.

ఎంపీగా ఉన్నప్పుడు ఆస్పత్రి సందర్శనకు వచ్చిన కవిత పేద రోగులకు సరైన ఆహారం దొరకడం లేదనే విషయం తెలుసుకొని ఆస్పత్రిలో అన్నదానం ప్రారంభించారు. రోజూ 800 వందలమందికి పైబడి ఇక్కడ భోజనం చేస్తున్నారు.

ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి స్పందన రావడంతో జిల్లాలోని బోధన్ లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 2018 ఏప్రిల్ 26 న అన్నదానం ప్రారంభించారు. ఇక్కడ సుమారు 400 మంది భోజనం చేస్తున్నారు. ఆ తరువాత ఆర్మూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 2018 జులై 5 నుంచి అన్నదానం ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రులకే పరిమితం చేయకుండా పేద విద్యార్థుల కోసం నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం వద్ద కూడా అన్నదాన కేంద్రం 2018 జులై 15 న ప్రారంభించారు. ఇక్కడ సుమారు 250 మంది విద్యార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. పేదల పట్ల కవిత ఔదార్యం సర్వత్రా ప్రశంసలు పొందుతోంది.
దీనిపై మరింత చదవండి :