Assam Exit Poll, అధికారం భాజపాదేనంటున్న పోల్ రిజల్ట్స్
అస్సాంలో ఏప్రిల్ 9న మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన సీట్ల సంఖ్య 64 కాగా Assam Exit Poll రిజల్ట్సులో అధికారాన్ని భాజపా చేజిక్కించుకుంటుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి.
యాక్సిస్ మై ఇండియా భాజపాకు 88 నుంచి 100 స్థానాలు వస్తాయనీ, కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 36 స్థానాలు రావచ్చనీ, ఇతరులు 3 చోట్ల గెలవచ్చని తెలిపింది. మాట్రైజ్ తెలుపుతూ... భాజపా 85 నుంచి 95 స్థానాలు కైవసం చేసుకుంటుందనీ, కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 32 స్థానాలు రావచ్చని వెల్లడించింది. ఇతరులకు 6 నుంచి 12 మధ్యన స్థానాలు కైవసం చేసుకుంటారని అంచనా వేసింది.
