1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. KCR Comments about Jubilee Hills Bypoll Results

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

KCR_Harish Rao
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోయారు. 25వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. 25వేల ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఫలితం ఎలా ఉన్నా కూడా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయంపై కేసీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం, అక్రమ మార్గాలను అనుసరించడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. 
 
ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్