సంబంధిత వార్తలు
- IPL 2021 UAE: ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు..!
- సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టీ-20 ప్రపంచ కప్ కూడా..?
- ఐపీఎల్లో మిగిలిపోయిన మ్యాచ్‌లు నవంబరులో?
- అక్టోబరులో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : పాక్ ఆటగాళ్లకు వీసాలు లభించేనా?
- అయోధ్య రామాలయానికి కుప్పలుతెప్పలుగా విరాళాలు, రూ. 1500 కోట్లు దాటేసింది...
శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు-అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన ట్విట్టర్‌లో వెల్లడించింది. అయితే ఆలయానికి సంబంధించిన గ్రౌండర్ ఫ్లోర్ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు, కార్మికులు అంతా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది. ప్రతి రోజు రెండు ఫిఫ్ట్‌లుగా పనులు జరుగుతున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
పునాది పనులను రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ టెక్నిక్‌లో పూర్తి చేయనున్నారు. సుమారు లక్షా 20 వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలో 40 నుంచి 45 లేయర్లలో కాంక్రీట్ వేయనున్నారు. ఇప్పటికే నాలుగు లేయర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆర్‌సీసీ పనులు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నట్లు ట్రస్టు తన ట్వీట్‌లో తెలిపింది.
