సంబంధిత వార్తలు
- అశ్వానికి కాషాయం రంగు : బీజేపీపై మేనకా గాంధీ సంస్థ ఫిర్యాదు
- ఇష్టమైన లక్కీ మస్కట్పై ఫోజులిచ్చిన ప్రియాంక-నేను ముద్దుగా లేనా!
- మా నాన్నకు ఆ పిచ్చి వుండేది.. అనసూయ భరద్వాజ్
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : గాడిదల కోసం అధికారుల పాట్లు
- విశాఖ ఏజెన్సీ - దాయర్తి: ఆ ఊరిలో అందరూ కౌబాయ్స్లా గుర్రాల మీద తిరుగుతారు, ఎందుకో తెలుసా?
గుర్రం కూర్చోదేం?
మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి.
అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం.
దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది.
అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.
