శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (07:58 IST)

నేడు హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 6గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు.

అనంతరం భువనగిరిలోఉచిత రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఘట్కేసర్ వద్ద కేంద్రమంత్రికి మేడ్చల్ జిల్లా బీజేపీ ఘనస్వాగతం పలకనున్నారు.

మధ్యాహ్నం 12గంలకు ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర కిషన్‌రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలుకుతారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.