1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka Road accident: 13 dies

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

Karnataka
కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. తుమ్కూరు జిల్లా.. బలడ్కేర్ వద్ద బెంగుళూరు, మంగుళూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ధర్మస్థల్ నుంచి వస్తున్ననలుగురు యువకుల బ్రెజా కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. 
 
అదే సమయంలో తమిళనాడు నుంచి వస్తున్న టవేరా కారు.. పల్టీలు కొట్టిన కారును బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది అక్కడికక్కడే తీవ్రగాయాలతో మృతిచెందారు. 
 
మరణించిన వారిలో నలుగురు కర్ణాటకు చెందినవారు కాగా.. 9 మంది తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా