మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కర్నాటకను హడలెత్తిస్తున్న మంకీఫీవర్...

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 61 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారినపడి సుమారుగా మూడు వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈ కరోనా కేసులు భారతదేశంలో కూడా నమోదయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ చనిపోలేదు. 
 
ఈ క్రమంలో భారత్‌లో మరో ప్రమాదకర వైరస్ తన ఉనికి చాటుకుంటోంది. మంకీ ఫీవర్ వైరస్‌గా పిలిచే ఈ మహమ్మారి కారణంగా కర్నాటకలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతంలో 55 మంది మంకీ ఫీవర్ బారినపడినట్టు గుర్తించారు. 
 
వాస్తవానికి ఈ వ్యాధిని కైసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా వ్యవహరిస్తారు. దీనికే మంకీ ఫీవర్ అని మరో పేరుంది. మంకీ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ఆందోళన హెచ్చుతోంది. 
 
సిద్ధపుర తాలూకాకు చెందిన భాస్కర్ గణపతి హెగ్డే (64), మరో మహిళ మంకీ ఫీవర్ కారణంగా మరణించినట్టు అధికార వర్గాలంటున్నాయి. దీంతో కర్నాటక ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఈ మంకీ ఫీవర్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.