శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (13:26 IST)

పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ వీడియో... కాశ్మీరీ విద్యార్థుల అరెస్ట్

పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసిన ముగ్గురు విద్యార్థులను కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, హూబ్లీలో కేఎల్ యూనివర్శిటీలో కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు. 
 
ఈ ముగ్గురు పాకిస్థాన్‌కు మద్దతుగా అభిప్రాయాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
యూనివర్శిటీ తరపున కూడా ఆ ముగ్గురు విద్యార్థులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన విద్యార్థుల వద్ద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.