శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (15:38 IST)

విజయ్ కుట్టి స్టోరీ వీడియో వైరల్... మాస్టర్ చెప్తుంటే..?! (video)

Master Vijay
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ''మక్కల్ సెల్వన్" విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.
 
ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయ్. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుండి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ''కుట్టి స్టోరి'' అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినీ యూనిట్.
 
జీవితం చాలా చిన్నది, మనకు లైఫ్‌లో కలిగే బాధలను, టెన్షన్స్‌ను పక్కన పెట్టి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి అనే కాన్సెప్ట్‌తో మంచి జోష్‌తో సాగే ఈ సాంగ్‌కి యువత‌తో పాటు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ పాట సో ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.