ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (11:00 IST)

అనసూయ నడుముపై శేఖర్ మాస్టర్ చెయ్యేసి..? (video)

యాంకర్, నటిగా ఓ మెరుపు మెరుస్తున్న అనసూయ నడుముపై శేఖర్ మాస్టర్ చెయ్యేశాడు. జబర్దస్త్ షో ద్వారా అనసూయ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాదు ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించేంతగా ఆమె క్రేజ్ పెరిగింది.
 
అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా అనసూయ.. బుల్లితెరపై తనదైన శైలిలో రెచ్చిపోయింది. తాజాగా విడుదలైన ''లోకల్ గ్యాంగ్" షో ప్రోమోలో అనసూయ రెచ్చిపోయింది. లోకల్ గ్యాంగ్స్‌లో మాత్రం అనసూయ ఫుల్ స్వింగులో డ్యాన్స్ చేస్తోంది. 
 
యాంకర్ స్థాయి నుండి జడ్జికి ప్రమోట్ కావడంతో ఆరబోత రేంజ్‌ను కూడా పెంచేసింది. అయితే ఇదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాత్రం అనసూయకు పోటీగా పెర్ఫార్మెన్స్‌ చేశారు. మంచి డాన్సర్‌గా  పేరున్నశేఖర్ మాస్టర్ తో డాన్స్ ఇరగదీస్తోంది అనసూయ. 
 
ఈ షోలో అనసూయ నడుముపై శేఖర్ మాస్టర్ చేతులు వేసి చేసిన డాన్స్ చూసి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఇటీవల ఈ పోగ్రామ్ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో వీడియోను మీరూ ఓ లుక్కేయండి.