శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (12:23 IST)

భారత మార్కెట్లోకి రియల్ మీ 5ఐ.. ధర రూ.8,999 మాత్రమే

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్ మీ 5 సిరీస్‌లో ఇప్పటికే రియల్ మీ 5 ప్రో, రియల్ మీ 5 ఎస్ రిలీజ్ అయ్యాయి. తాజాగా బడ్జెట్ సెగ్మెంట్‌పై రియల్ మీ సిరీస్ గురిపెట్టింది. తక్కువ ధరలో రియల్‌మీ 5ఐ రిలీజ్ చేసింది. షావోమీకి చెందిన రెడ్‌మీ 8 మోడల్‌ను టార్గెట్ చేస్తూ రియల్‌మీ 5ఐ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. 
 
ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో విడుదల అయ్యింది. ప్రస్తుతం భారత్‌కు వచ్చింది. భారత్‌లో జనవరి 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. 
 
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో సేల్ మొదలయ్యింది. రిలయన్స్ జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ కల్పిస్తోంది. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ కూడా వున్నాయని రియల్ మీ తెలింపిది.