శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2020 (17:11 IST)

లుంగీ కట్టుకుని మాస్ లుక్‌లో మహేష్ బాబు... 'సరిలేరు నీకెవ్వరు'

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రెయిలర్ మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేయడం జరిగింది. మరోవైపు లుంగీతో వున్న తాజా లుక్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ మజా చేస్తున్నారు.
 
సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు... జనవరి 11న విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అన్న తపనతో వున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా సరిలేరు యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఫుల్ స్వింగ్‌లో ముందుకు తీసుకెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ప్రి-రిలీజ్ ఈవెంటుకు హాజరై అహో అనిపించేశారు. మొత్తమ్మీ భారీ అంచనాలతో విడుదలవుతున్న సరిలేరు నీకెవ్వరు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.