శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (19:59 IST)

16-02-2020 నుంచి 22-02-2020 మీ వార రాశిఫలాలు (Video)

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పొదుపు పథకాలు, పెట్టుబడులు లాభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పదవుల కోసం యత్నాలుసాగిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు ముందుకుసాగవు. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. పందేలు, జూదాల జోలికి పోవద్దు. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
వ్యవహారాలు, లావాదేవీలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. గృహమార్పు చికాకు పరుస్తుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సమస్యలు నిదానంగా సద్దుమణుగుతాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. విహయ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంబంధాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. గురువారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉపాధ్యాయుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ప్రయాణం తలపెడతారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3, పాదాలు. 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక లావాదేవీలలతో తీరిక ఉండదు. అకాల భోజనం విశ్రాంతి లోపం. శుక్ర, శనివారాల్లో పనులు బాధ్యతలు అప్పగించవద్దు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితుల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మానసికంగా కుదుటపడుతారు. దంపతుల మధ్య అగగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. వృత్థి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష. 
గృహంలో మార్పులుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. ఆది, సోమవారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతృప్తినిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యాయాలకు పొంతనవుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ధనప్రలోభం, ఒత్తిళ్ళకు లొంగవద్దు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం, హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మంగళ, బుధవారాల్లో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. పోగొట్టుకున్న వస్తువుల లభ్యమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. వేడుకలకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఏ విషయాన్ని మనస్సులో ఉంచుకోవద్దు. విజ్ఞతతో వ్యవహరించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పనిభారం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తి అమర్చుకోవాలే ఆలోచన స్ఫురిస్తుంది. చెల్లింపుల్లో మెలకువ వహించండి. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. మీ శ్రీమితి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తగ్గి కుదుపటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గురు, శుక్రవారాల్లో గత తప్పిదాలే పునరావృతమవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలే శ్రేయస్కరం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఈ వారం ధనలాభం, వాహన యోగం వున్నాయి. ఖర్చులు సామాన్యం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశయం నెరవేరుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు అందుకుంటారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయం తెలుసుకోవాలనే ఆసక్తి తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ  
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, చెక్కుల జారీల్లో జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. చిన్న తప్పిదమే సమస్యగా మారే ఆస్కారం వుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. శని, ఆదివారాల్లో ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. సమస్యలతో సతమతమవుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. అవివాహితుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణం విరమించుకుంటారు.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
పట్టుదలతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ప్రకటనలు, ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సోమ, మంగళవారాల్లో నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందపడి హామీలివ్వవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త. బుధవారం నాడు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వివాదాలకు పరిష్కారం గోచరిస్తుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఖర్చులు అధికం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీదైనా రంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బంధుత్వం కంటే స్నేహానికే ప్రాధాన్యమిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గురు, శుక్రవారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. ఆధిక్యత ప్రదర్శించవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.