మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:44 IST)

26-01-2020 నుంచి 01-02-2020 వరకు మీ వార రాశి ఫలితాలు.. (Video)

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. అపరిచితులను విశ్వసించవద్దు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
పంతాలు, పట్టుదలకు పోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆలోచనవలు పలు విధాలుగా వుంటాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు తగదు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సామరస్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. ఖర్చులు అధికం ప్రయోజనకరం. ఆది, మంగళవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. గృహ మరమ్మతులు చేపడతారు. ఒకే సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వ్యాపకాలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. అవగాహన లేని విషయాలకు దూరంగా వుండాలి, లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. పరిస్థితి అనుకూలత అంతంత మాత్రమే. బుధ, గురువారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. నోటీసులు అందుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది వుండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు సాగక విసుగు చెందుతారు. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా వ్యవహరించండి. శుక్ర, శనివారాల్లో విమర్శలు పట్టించుకోవద్దు. గృహ మరమ్మతలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహ పరుస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారం మీ చేతుల మీదుగా సాగుతుంది. బాధ్యతగా వ్యవహరించండి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తగదు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆదివారం నాడు ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. దంపతులకు కొత్త ఆలోచనసు స్ఫురిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
స్థిరాస్తి ఆదాయం లభిస్తుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పరిస్థితులు అనుకూలిస్తాయి. తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. సోమ, మంగళవారాల్లో గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం వుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పత్రాలు, నగదు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. బుధవారం నాడు వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక ఇతరులకు వెల్లడించవద్దు. ముఖ్య సమాచారం సేకరిస్తారు. ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రియతములను కలుసుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం దూకుడును అదుపు చేయండి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. గురు, శుక్రవారాల్లో పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు రూపొందించుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. బంధువుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు. విలువైన వస్తువుల మరమ్మతుకు గురవుతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆది, సోమవారాల్లో మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. చెల్లింపులు మెలకువ వహించండి. బుధ, గురువారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఆరోగ్యం సంతృప్తికరం. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి గడ్డుకాలం. ప్రయాణం తలపెడతారు.