శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:18 IST)

02-02-2020 నుంచి 08-02-2020 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం   
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపై దృష్టి పెడతారు. శుక్ర, శనివారాల్లో చెక్కుల జారీ, సంతకాల్లో జాగ్రత్త. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అపరిచితులను నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. యత్నాలు విరమించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సమస్యలు సద్దుమణుగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది వుండదు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు   
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అధికం. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తి  చేస్తారు. అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యవహారానుకూలచ అంతంత మాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. మంగళ, బుధవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మనస్థిమితం ఉండదు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. గురు, శుక్రవారాల్లో పనులతో సతమతమవుతారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఏజెన్సీ, కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
నిబద్ధతో వ్యవహరిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి హామీలివ్వవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సి వుంటుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభం గడిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. చేతివృత్తుల ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు ఉండదు. సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు  
వ్యవహార దక్షతతో రాణిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆలయాలు, ఆపన్నులకు సాయం అందిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. గృహంలో సందడి నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. సంతకాలు చెక్కుల జారీల్లో జాగ్రత్త. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుస కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు   
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనుకూలతలున్నాయి. వ్యవహారాల్లో తీరిక ఉండదు. ఆదాయానికి తగట్టు ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బుధవారం నాడు మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వాగ్వాదాలకు దిగవద్దు. చెక్కుల జారీ, సంతకాల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. పనివారలతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు ఊహించని సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. దైవకార్యంలో పాల్గొంటారు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ  
స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. సన్నిహితుల సలహా పాటించండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఖర్చులు అధికం. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురు, శుక్రవారాల్లో వ్యవహారాలతో తీరిక ఉండదు. సంతానం విజయం ఉల్లాసం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. శనివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం.
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు  
ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రుణ ఒత్తిళ్లు అధికం. ఆత్మీయుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలు లాభిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సమర్థతనను చాటుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఒత్తిడి, పనిభారం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో వుండవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు హడావుడిగా సాగుతాయి. అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తే చేసుకుంటారు. స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. కొత్తప్రదేశాలు సందర్శిస్తారు.