సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (18:50 IST)

రేపు ఎల్లుండి బ్యాంకులతో పని వుందా.. ఐతే కుదరదు

రేపు, ఎల్లుండి బ్యాంకులతో పని వుంటే వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంక్ యూనియన్లు జనవరి 31, ఫిబ్రవరి 1న సమ్మెకు దిగుతున్నాయి. దీనితో బ్యాంక్ కార్యకలాపాలపై ఈ ప్రభావం పడబోతోంది. మరోవైపు ఫిబ్రవరి 2 ఆదివారం కావడంతో మొత్తం 3 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు యూనియన్ల సమ్మెను విరమింపజేసేందుకు చేసిన యత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. దీనితో యూనియన్లు సమ్మెకి దిగుతున్నాయి.
 
వేతన పెంపు కోసం 2017 నుంచి ఎదురుచూపులు చూస్తున్నామనీ, తాము ఎన్నిమార్లు విన్నపాలు చేసినా బ్యాంక్స్ అసోసియేషన్ పట్టించుకోనందున తాము సమ్మె చేయడం మినహా మరో దారి లేదని యూనియన్లు చెపుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో బ్యాంకు యూనియన్ల సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అవి ఎంతమేరకు విజయవంతమవుతాయో చూడాలి.