శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (18:42 IST)

ఉల్లిపాయలు తింటే మధుమేహం మటాష్.. (video)

ఉల్లిపాయల్ని తింటే షుగర్ కంట్రోల్‌‌లో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. షుగర్‌‌ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌‌ ఇంజెక్షన్‌‌ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్‌‌తో సమానమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అందుకే క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్‌‌ లెవెల్‌‌ కంట్రోల్‌‌ అవుతుంది. ఉల్లిపాయలు యాంటీ హిస్టామైన్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి వుంటాయి. ఇవి ఆస్తమాతో బాధపడుతున్న వారికి చక్కగా పనిచేస్తాయి. పసుపు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. 
 
రక్తపోటును తగ్గించడంతో ఉల్లిపాయలు ఎంతగానో దోహదపడతాయి. రక్తపోటును నియంత్రణలో కూడా ఉంచుతాయి. రక్తనాళాలకు సాగే గుణాన్ని పెంచడంతో పాటు వాటిని వెడల్పు కూడా చేస్తాయి. ఉల్లిపాయలను పచ్చిగా తింటే దంతాలు దృఢమవుతాయి. నోటిలోని చెడు బ్యాక్టీరియా నాశనమవుతుంది. రెండు లేదా మూడు నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయను బాగా నమిలితే నోటిలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.