శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (21:59 IST)

వామ్మో... కొందరు మాట్లాడుతుంటే భరించలేని దుర్వాసన ఎందుకని?

నోటి దుర్వాసనకు నోట్లోనే సమస్య కారణం అని అనుకోనక్కర్లేదు. చాలాకాలం నుంచి ఉన్న అజీర్ణం కూడా ఇందుకు కారణం. ఈ దుర్వాసనను నియంత్రించేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 
 
ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, వాము 50 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు కలిపి వేయించి పొడి చేసుకుని గోరువెచ్చటి నీటిలో ఉదయం, సాయంత్రం లోపలికి తీసుకుంటూ ఉండాలి. అలాగే పటిక, ఉప్పు కలిపి వేడినీళ్లలో వేసుకుని రోజూ రెండుమూడుసార్లు పుక్కిలి పట్టాలి. సమస్య తగ్గిపోతుంది.