ఉదయం పెళ్లితో ఒక్కటయ్యారు.. సాయంత్రం రిసెప్షన్‌లో విడిపోయిన ప్రేమ జంట.. ఎందుకు?
Marriage
కేరళ సరిహద్దులోని పారసాల సమీప గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న ఆమెను పెళ్లి చేసుకునేందుకు రూబెన్ చాలా కష్టపడ్డాడు. మొదట యువతి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించినా, చివరికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారు.
దీంతో అక్టోబర్ 12న సోమవారం ఉదయం పారసాలలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం వరుడి స్వగ్రామం రీతాపురంలోని ఒక మ్యారేజ్ హాల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో, వరుడు రూబెన్ ప్రవర్తనతో వివాదం మొదలైంది. రిసెప్షన్‌లో రూబెన్ ఫుల్లుగా మద్యం తాగి, నిలబడలేని స్థితిలో తూలుతూ కనిపించాడు. ఈ వివాదం కారణంగా వరుడు మామ, భార్యపై దాడి చేశాడు.
గాయపడిన వధువు, ఆమె తండ్రి కుళచ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కుళచ్చల్ పోలీస్ స్టేషన్‌లో రూబెన్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రూబెన్ కోసం గాలిస్తున్నారు. అదే రాత్రి వధువు తన తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఉదయం పెళ్లితో ఒక్కటైన జంట సాయంత్రానికే విడిపోయింది.

