1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Nitish Kumar resigns; Samrat Choudhary set to become next Bihar CM

బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ

Samrat Choudhary
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాసనభాపక్ష నేతగా సమ్రాట్ ఛౌదరిని ఎంపికయ్యారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు సీఎం పదవికి నీతీశ్‌కుమార్‌ రాజీనామా చేశారు. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం జేడీయూలో చేరారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. బీహార్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి బీజేపీ నేతగా ఆయన నిలువనున్నారు.
 
కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన సమ్రాట్‌.. క్రమంగా ఎదుగుతూ వచ్చారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే తదుపరి సీఎంగా ఆయనను ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా 
 
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోన లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుందు ఆయన తన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ రద్దు విషయాన్ని సహచరులకు తెలియజేశారు. ఆ తర్వాత లోక్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు.
 
దీంతో బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్‌ చౌధరీ కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కాగా, ఇటీవల రాజ్యసభ సభ్యుడుగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. నితీశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక పదవిని అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హైదరాబాద్‌లో నూతన ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించిన ఆసుస్