శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (12:02 IST)

అర్థరాత్రి ప్రియుడితో ఉల్లాసం... కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే?

అర్థరాత్రి ప్రియుడుతో శృంగారంలో పాల్గొంది.. ఆ మహిళ. అయితే ఆ సమయంలో భర్త రావడం.. ఆ వ్యవహారాన్ని కళ్లారా చూడటంతో దారుణం జరిగిపోయింది. అవును ప్రియుడితో ఉల్లాసంగా గడిపిన మహిళను ఆమె భర్త హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు.. తూత్తుకుడిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... తూత్తుక్కుడి కోవిల్‌పట్టి, నటరాజపురానికి చెందిన మారిముత్తుకు అతని భార్య విమలకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే విమలకు కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మారిముత్తు ఇంట్లో లేని సమయంలో కుమార్ ఇంటికి రావడం విమలతో ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న మారిముత్తు.. ఇళ్లు మార్చాడు. 
 
అయినా విమలలో మార్పు రాలేదు. అలా ఓ రోజు అర్థరాత్రి ప్రియుడితో విమల గడపటాన్ని మారిముత్తు చూడటంతో.. కోపావేశానికి గురైన అతడు విమలను హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారిముత్తును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.