శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (15:51 IST)

ఇవాల్టితో ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... మీ ఫోను కూడా ఉందా?

వాట్సప్ ఫీచర్ ఈ రోజు నుంచి ఆ ఫోన్లలో పనిచేయదు. నోకియా సింబియన్, బ్లాక్‌బెర్రీ 10, ఆండ్రాయిడ్ పాత వెర్షన్ ఫీచర్లతో వున్న ఫోన్లలో తమ సేవలు ఇక అందుబాటులో వుండవని వాట్సప్ తెలిపింది. ఎందుకంటే... ఆ ఫోన్లలో వాట్సప్ ఉపయోగించుకునే సామర్థ్యం లేదు కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
 
ఏయే ఫోన్లలో వాట్సప్ పనిచేయదో జాబితాలో వెల్లడించింది. ఇకపై వాట్సప్ ఉపయోగించాలంటే ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఐఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+ ఉండాలనీ, అది లేనట్లయితే వాట్సప్ నిచేయదని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం... ఇకపై వాట్సప్ పనిచేయని ఫోన్లు, నోకియా ఎస్40, నోకియా ఎస్60, బ్లాక్‌బెర్రీ ఓఎస్.