భారత మార్కెట్లోకి షియోమీ ''పోకో ఎఫ్1'' స్మార్ట్‌ఫోన్

Last Updated: బుధవారం, 26 డిశెంబరు 2018 (15:32 IST)
స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రోజుకో కొత్తరకం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. తాజాగా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన స్మోర్ట్‌ఫోన్ నుంచి ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 
 
ఈ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. దీని ధర రూ.23,999. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనే వినియోగదారుల కోసం జియో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2400 ఇన్స్టంట్ జియో క్యాష్ బ్యాక్‌తో పాటు 6టీబీ 4జీ డేటాను ఉచితంగా పొందనున్నారు. 
 
ఇక ఆర్మర్డ్ ఎడిషన్ వేరియంట్‌ ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్ లాక్, హైబ్రిడ్ డ్యుయెల్ సిమ్ 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్) 
20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ 
6.18 డిస్‌ప్లే (2246 X 1080) పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. దీనిపై మరింత చదవండి :