1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Uttarpradesh corona cases

ఉత్తరప్రదేశ్‌-28మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్

Uttara pradesh
ఉత్తరప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా యూపీలో 28మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 
 
రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆగ్రా నగరంలోనే గత పదిరోజుల వ్యవధిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. 
 
ఈ వ్యాపారులకు కరోనా వైరస్.. ఎలా సోకిందన్న దానిని గుర్తించేందుకు పోలీసులు, పలువురు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా టెస్టులు చేయగా.. వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలిందని ఆగ్రా ఎస్పీ తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన కూరగాయల వ్యాపారులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
తర్వాతి కథనం
ఏపీలో ఉపాధి కోల్పోయిన వారి కోసం అత్యవసర నిధి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి