శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (13:47 IST)

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్.. ఇటలీ శుభవార్త

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసిందని ఇటలీ శుభవార్త చెప్పేసింది. కరోనా నివారణకు తమ సైంటిస్టులు వ్యాక్సిన్ రెడీ చేసినట్లు ఇటలీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. టకీస్ సంస్థ దీన్ని సిద్ధం చేసి మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో దీన్ని ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ యాంటీ బాడీలను ఉత్పత్తి చేసిందని… వ్యాక్సిన్ తయారీలో ఇదో కొత్త ఫేజ్ అని తెలిపారు. 
 
మానవ కణాలలో వైరస్‌ను వ్యాక్సిన్ న్యూట్రల్ చేసిందని టకీస్ సీఈఓ లుయిగి కారిసిచియో చెప్పారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేస్తామన్నారు. కచ్చితంగా కరోనాను నివారిస్తుందని తెలిపారు. తమ ప్రయోగం రిజల్ట్స్ అంచనాలకు మించి వచ్చాయన్నారు.
 
దీంతో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే రావచ్చునని ఆశలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.