1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Yeddyurappa about diwali fireworks

బాణసంచా కాల్చడంపై వెనక్కి తగ్గిన యడ్డ్యూరప్ప సర్కార్

Yeddyurappa
దీపావళి సందర్భంగా బాణసంచాలు కాల్చడంపై పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో ఎవరూ బాణసంచా కాల్చకూడదంటూ ఢిల్లీ సహ పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. కర్ణాటకలో యడ్డ్యూరప్ప ప్రభుత్వం కూడా బాణసంచాపై నిషేదం విధించింది.
 
అయితే ఈ విషయంలో యడ్డ్యూరప్ప కాస్త వెనక్కి తగ్గారు. బాణసంచాను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, అందువల్ల వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని యడ్డ్యూరప్ప తెలిపారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చడం ఎలాంటి అభ్యంతరం లేదని తెలి పారు.
 
బాణసంచా తయారుచేసే కంపెనీలు కూడా పర్యావరణానికి హాని కలగని వాటినే తయారు చేయాలని, అలాంటి వాటినే అమ్మాలని తెలిపారు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీపావళి జరుపుకోవాలని తెలిపారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
తర్వాతి కథనం
కరోనా వేళ భారత్ స్కౌట్స్, గైడ్స్ సేవలు ప్రశంసనీయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్