Rajasthan: గర్భవతి అయిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. నవజాత శిశువు మృతి
Pregnant Minor
ఈ ఘటన కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఆ బాలిక గర్భవతిగా ఉండటం, ఆ తర్వాత ఆమెకు జన్మించిన శిశువు మరణించడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారిని నియమించారు. 16 ఏళ్ల బాలిక గర్భవతిగా ఉండగా, ఆమెకు ప్రసవం జరిగిందని, అయితే పుట్టిన శిశువు బతకలేదని పోలీసులు పేర్కొన్నారు. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమెను కొందరు యువకులు అపహరించి, ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ సమయంలో బాధితురాలు ప్రసవించి, అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ఒక ఆసుపత్రికి చేరుకోగా, అక్కడ నవజాత శిశువు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది.
బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. అనుమానితుడిగా పేర్కొన్న ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

