Trivikram Srinivas : త్రివిక్రమ్ మార్పు డివివి దానయ్య బేనర్ లో ఎన్.టి.ఆర్. సినిమా వరకేనా?
రెండురోజులుగా త్రివిక్రమ్ శీనివాస్ నిర్మిస్తున్న హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ నుంచి తప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హల్ చేస్తున్నాయి. ఆదర్శకుటుంబం ప్రమోషన్ లో నిర్మాత నాగవంశీ కూడా ఎన్.టి.ఆర్. సినిమా ఎప్పుడు? అని అడిగినప్పుడు అది నేను ఇప్పుడే చెప్పకూడదు. త్వరలో వివరాలు తెలుస్తాయి. ఎన్.టి.ఆర్. తో సినిమా చేయడం అంటే పెద్ద ఎచీమ్ మెంట్ గా అన్నారు. అప్పటికే సూచాయిగా ఏదో జరుగుతుందని అక్కడివారికి అనిపించింది.
ఇక ఎన్.టి.ఆర్. సినిమాను కేవలం దానయ్య బేనర్ లో చేయడమే ఎయిమ్ గా త్రివిక్రమ్ పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సహజంగా దానయ్య ఎవరితోనూ పార్టనర్ షిప్ చేసుకోవడనీ సన్నిహితుల సమాచారం. ఏదిఏమైనా ఎన్.టి.ఆర్. సినిమా అంటే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
దాదాపు ₹600 కోట్ల ప్రాజెక్ట్, త్రివిక్రమ్ మరియు నిర్మాణ సంస్థ హారిక & హాసిన్ క్రియేషన్స్ మధ్య ఆర్థిక సమస్యలు మరియు సృజనాత్మక విభేదాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కాగా, ఎన్.టి.ఆర్. త్రివిక్రమ్ సినిమా పోస్టర్ ను కూడా కొందరు డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుకుంటున్నారు.
ఇదిలా వుండగా, మెగాస్టార్చిరంజీవి కూడా DVVదానయ్య కి తన అంగీకారాన్ని తెలిపారని, అలాగే త్రివిక్రమ్‌శ్రీనివాస్ గారితో కలిసి ఒక స్క్రిప్ట్‌పై పనిచేయమని సూచించారని సమాచారం. లోగడ దానయ్య తో చిరంజీవి గారి డేట్స్‌ను ఖరారు చేసుకుంది. కనుక అన్నీ సహకరిస్తే చిరంజీవితోనూడా త్రివిక్రమ్ సినిమా వుండవచ్చనని అభిజ్నవర్గాల భోగట్టా.

