1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
  4. Andhra Style Chicken Pickle

ఆంధ్రా స్టైల్.. చికెన్ ఊరగాయ ఎలా చేయాలి?

Andhra Style Chicken Pickle
వేసవిలో ఆవకాయ్ వంటి ఊరగాయల తయారీకి రెడీ అవుతున్నారా? వీటితో పాటు చికెన్ ఊరగాయ కూడా పిల్లలకు నచ్చే విధంగా ఇంట్లోనే ట్రై చేయండి.  
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ : ఒక కేజీ
ఉప్పు, కారం, పసుపు పొడి : తగినంత 
పోపు గింజలు : తగినంత 
రెడ్ చిల్లీ పౌడర్ : ఒక కప్పు 
చింతపండు పేస్ట్ : పావు కప్పు  
 
తయారీ విధానం :
చికెన్ ముక్కల్ని ముందుగా శుభ్రం చేసుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుని కారం, ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కనబెట్టేయాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పోపు గింజలు వేయాలి.

వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చేర్చి.. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చింతపండు పేస్ట్ చేర్చి రెండు నిమిషాలుంచి స్టౌ ఆఫ్ చేసేస్తే చికెన్ ఊరగాయ రెడీ.. ఈ ఊరగాయ అన్నంలోకి టేస్ట్‌గా ఉంటుంది.
About Writer
Selvi