శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 నవంబరు 2017 (22:41 IST)

ఆస్ట్రేలియాలో దేశపతి శ్రీనివాస్ ఘెరావ్

ఆస్ట్రేలియా: సిడ్నీలో ప్రపంచ తెలుగు సభల సన్నాహాక సభలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతి శ్రీనివాస్‌ని ఘెరావ్ చేసారు. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్య పరిచయంలేని వ్యాపారవేత్తను ఎన్నారై కో-ఆర్డ

ఆస్ట్రేలియా: సిడ్నీలో ప్రపంచ తెలుగు సభల సన్నాహాక సభలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతి శ్రీనివాస్‌ని ఘెరావ్ చేసారు. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్య పరిచయంలేని వ్యాపారవేత్తను ఎన్నారై కో-ఆర్డినేటర్‌గా నియమించి తెలుగు మహాసభల స్థాయిని తగ్గించారని ఘెరావ్ చేసారు.
 
అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కో-ఆర్డినేటర్‌గా నియమించారని ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని వెంటనే మహేష్‌ను తొలగించి ఆ స్థానంలో సాహిత్యవేత్తలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశపతి శ్రీనివాస్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
 
మహేష్ బిగాల నియామకం పైన ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో వ్యతిరేకించారని ఎందుకు తెలుగు సభల గౌరవాన్ని తగ్గిస్తారని నిలదీశారు. మహేష్ బిగల నియామకం చట్టరీత్య కూడా చెల్లదని దానికి ప్రతిపాదికనే సరిగా లేదని ఆయన్ని విధుల నుండి తప్పించాలని రాజశేఖర్ రెడ్డి మన్యం డిమాండ్ చేసారు. 
 
దేశపతి శ్రీనివాస్ రెడ్డి కులాన్ని కించపరచడం పైన ఎన్నారైల నిరసనలు  
గతంలో ఒక టివి ఛానల్‌లో దేశపతి శ్రీనివాస్ రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై  పలువురు ఎన్నారైలు నిరసన తెలిపి కులం పేరున రాజకీయాలు తగవని ఏ కులాన్ని దూషించడం తగదని దేశపతి యావత్ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం టీపీసీసీ ఎన్నారై సెల్ -ఆస్ట్రేలియా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మన్యం, మేక దేవి ప్రసాద్ రెడ్డి, సాయిరాం పసునూరి, ఖాజా ఇమ్రాన్ మహమ్మద్, జి రామ్, ప్రవీణ్ కట్టెకోల, పవన్ కుమార్ పోలిశెట్టిల ఆధ్వర్యంలో జరిగింది.