నాట్స్ చికాగో సంబరాల బృందం సేవలు ప్రశంసనీయం

చికాగో: చేయిచేయి కలిపి అడుగులు వేస్తే అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయి. ఒక్కరిగా చేయలేనిది అందరం ఒక్కటై చేయగలం అనే సత్యాన్ని నాట్స్ ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంది. నాట్స్‌తో కలిసి వచ్చే ప్రతి సభ్యుడికి తగిన గౌరవం ఇస్తుంది. తగిన ప్రాధాన్యం కల్పిస్తుంది. ఈ

NATS
ivr| Last Modified మంగళవారం, 31 అక్టోబరు 2017 (21:07 IST)
చికాగో: చేయిచేయి కలిపి అడుగులు వేస్తే అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయి. ఒక్కరిగా చేయలేనిది అందరం ఒక్కటై చేయగలం అనే సత్యాన్ని నాట్స్ ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంది. నాట్స్‌తో కలిసి వచ్చే ప్రతి సభ్యుడికి తగిన గౌరవం ఇస్తుంది. తగిన ప్రాధాన్యం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే నాట్స్ చికాగోలో ఈ ఏడాది జరిపిన సంబరాలకు సర్వశక్తులు ఒడ్డిన చికాగో నాట్స్ బృందాన్ని ఘనంగా సత్కరించుకుంది. వారి సేవలను.. సంబరాల నిర్వహణలో వారు చూపిన చొరవను నాట్స్ జాతీయ నాయకత్వం ప్రశంసలతో ముంచెత్తింది.
 
స్థానిక నాయకత్వాలకు పెద్దపీట వేస్తూ వారిని ముందుండి నడిపించే నాట్స్ జాతీయ నాయకత్వం చికాగో నాట్స్ తెలుగు సంబరాల్లో స్థానిక నాయకత్వాన్నే ప్రోత్సహించింది. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేలా చేసింది. చికాగో నాట్స్ సంబరాల బృందాన్ని ప్రశంసిస్తూ వారి సేవలను కొనియాడుతూ ఓ ఆత్మీయ సమ్మేళనాన్ని చికాగోలో ఏర్పాటు చేసింది. దీనికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్యాం మద్ధాళి, నాట్స్ ప్రెసిడెంట్  మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ కార్యదర్శి రమేష్ నూతలపాటి, నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ డాక్టర్ రవి ఆలపాటి, డాక్టర్ కొడాలి శ్రీనివాస్, రాజేంద్ర మాదలతో పాటు పలువురు నాట్స్ జాతీయ నాయకులు విచ్చేశారు.  ఈ సందర్భంగా వారంతా చికాగో నాట్స్ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. 
NATS
 
ప్రముఖ యాంకర్ లాస్య వ్యాఖ్యనంతో మొదలైన ఈ అభినందన కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. దాదాపు 500 మంది నాట్స్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సంబరాల్లో తమ సర్వశక్తులు ఒడ్డి శ్రమించిన ప్రతి ఒక్కరిని నాట్స్ జాతీయ నాయకత్వం ఈ సందర్భంగా సత్కరించింది. 
 
మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, శ్రీనివాస్  పిడికిటి, రామకృష్ణ బాలినేని, శ్రీనివాస బొప్పన, మహేశ్ కాకర్ల, శ్రీధర్ ముమ్మనగండి, విజయ్ వెనిగళ్ల, కృష్ణ నిమ్మగడ్డ, రాజేష్ వీదులముడి, హరీశ్ జమ్ముల, పృధ్వీ చలసాని, కృష్ణ నున్న, బిందు బాలినేని, లక్ష్మి బొజ్జ, ప్రసుధ సుంకర, అను కాకర్ల, రమ కొప్పాక తదితరులు నాట్స్ సంబరాలను విజయవంతం చేసినట్టుగానే ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇక్కడే బావర్చి రెస్టారెంట్ పసందైన తెలుగింటి భోజనాన్ని నాట్స్ సభ్యులకు వడ్డించింది.
NATS
 
దీపావళి సంబరాలు
చికాగో నాట్స్ బృందంతో కలిసి నాట్స్ జాతీయ నాయకత్వం ఇక్కడే దీపావళి సంబరాలు కూడా చేసుకుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయలకు అధిక ప్రాథాన్యం ఇచ్చే నాట్స్ సభ్యులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి క్రాకర్స్ కాల్చి ఇక్కడే దీపావళిని జరుపుకున్నారు.దీనిపై మరింత చదవండి :