ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (16:41 IST)

రత్నాకర్ సెట్టిపల్లి కుటుంబానికి నాట్స్ అండ... 13 వేల డాలర్ల ఆర్థిక సహాయం

డల్లాస్: అమెరికాలోని తెలుగు వారికి నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా ఎల్లపుడు అందుబాటులో ఉండే నాట్స్ గత నవంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యుల వైద్య సహాయం కొరకు 13 వేల డాలర్ల నిధులను సమీకరించింది.

డల్లాస్: అమెరికాలోని తెలుగు వారికి నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా ఎల్లపుడు అందుబాటులో ఉండే నాట్స్ గత నవంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యుల వైద్య సహాయం కొరకు 13 వేల డాలర్ల నిధులను సమీకరించింది. 
 
గత ఆదివారం ఇర్వింగ్ నగరంలోని 'బిర్యానీ అండ్ మోర్' రెస్టారెంట్లో 13 వేల డాల్లర్ల చెక్‌ను నాట్స్ హెల్ప్ లైన్ టీం స్థానిక టెక్సాస్ స్టేట్ హౌస్ ప్రతినిధి, మాట్ రినాల్డి సమక్షంలో రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది. రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాట్స్ అండతో తమ కుటుంబం కొంత కోలుకునే అవకాశం లభించిందని, నాట్స్ అందించిన సహాయానికి చాలా కృతజ్ఞతలు తెలియచేశారు.
 
ఈ సందర్భంగా స్టేట్ హౌస్ రెప్రెజంటేటివ్ మాట్ రినాల్డి మాట్లాడుతూ నాట్స్ సంస్థ తన హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి మాట్లాడుతూ రత్నాకర్ సెట్టిపల్లి కుటుంబానికి జరిగిన నష్టం చాలా  బాధాకరమని, వారి కుటుంబానికి నాట్స్ సంస్థ ఎలాంటి సహాయం కావాల్సినా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు డైరెక్టర్స్ డాక్టర్ చౌదరి ఆచంట మరియు రాజేంద్ర మాదాల, నాట్స్ హెల్ప్‌లైన్ ముఖ్య కార్యకర్తలు ఆది గెల్లి మరియు బాపు నూతి, డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని, మహిళా విభాగం కో-ఆర్డినేటర్  జ్యోతి వనం, నాట్స్ డల్లాస్ ముఖ్య సభ్యులు కిషోర్ వీరగంధం, రాజా మాగంటి, రవి బొజ్జురి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.