శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 జూన్ 2017 (20:34 IST)

సినారె మృతి తెలుగుజాతికి తీరని లోటు: నాట్స్

తెలుగుజాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహాకవి సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జ్ఞానపీఠ్ అవార్డుకే వన్నె తెచ్చిన సినారె ఇక లేరనే వాస్తవ

తెలుగుజాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహాకవి సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జ్ఞానపీఠ్ అవార్డుకే వన్నె తెచ్చిన  సినారె ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపింది.
 
భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సినారె పాట.. సినారె కవిత చిరంజీవిగా ఉంటాయని.. అవి తెలుగుజాతి ఉన్నంత కాలం వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని నాట్స్ ప్రకటించింది. సినారె కుటుంబ సభ్యులకు నాట్స్ తన ప్రగాడ సానుభూతిని తెలియచేసింది.