సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (21:29 IST)

ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో “గజల్ గాంధీ గానం”(Video)

ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్‌లో తన శాంతి సుహృద్భావ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డా. గజల్ శ్రీనివాస్ “గోల్డెన్ డ్రీమ్స్ ఆఫ్ గాంధీజీ” అన్న మహాత్మా గాంధీ అహిం

ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్‌లో తన శాంతి సుహృద్భావ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డా. గజల్ శ్రీనివాస్ “గోల్డెన్ డ్రీమ్స్ ఆఫ్ గాంధీజీ” అన్న మహాత్మా గాంధీ అహింసా సిద్దాంత గీతాన్ని హిబ్రు, హిందీ మరియు ఆంగ్ల భాషలలో గానం చేసి భారతీయుల యొక్క సత్యాగ్రహ, అహింసా సిద్ధాంతాన్ని చాటిచెప్పారు. కొన్ని వందల సంవత్సరాల భారత్-ఇజ్రాయిల్ స్నేహ బంధాన్ని తన గానంలో గుర్తు చేసారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇజ్రాయిల్ పార్లమెంట్ సభ్యులు విదేశి వ్యవహారాల డైరెక్టర్ జనరల్ Mr. యహుదాహ్ గ్లిక్ పాల్గొని డా. గజల్ శ్రీనివాస్‌ను ఆలింగనం చేసుకుని, హిబ్రు భాషలో గానం చేసినందుకు అభినందించారు. హిబ్రు భాషలో పాడిన గీతాన్ని ఇజ్రాయిల్ పార్లమెంట్‌కు అందించవలసిందిగా కోరారు. ప్రపంచంలో శాంతి సామరస్యం కోసం ఆ గీతాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ ఇండో-ఇజ్రాయిల్ ఫ్రెండ్‌షిప్ ఫోరం సభ్యులతో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి Mr. బెంజమిన్ నేటాన్ యాహుకు, ఇజ్రాయిల్ పార్లమెంట్ సభ్యులు విదేశి వ్యవహారాల డైరెక్టర్ జనరల్ Mr. యహుదాహ్ గ్లిక్‌కు భారత్-ఇజ్రాయిల్ మైత్రి జ్ఞాపికను శ్రీ రవికుమార్ అయ్యర్ చేతుల మీదుగా అందజేశారు. 
 
ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 125 భాషలలో పాడి ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, ఈ రోజు హిబ్రు భాషలో గాంధీ గీతాన్ని ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాలులో గానం చేసినందుకు అంతకంటే సంతోషం కలిగించిందని, ప్రపంచ శాంతికి తను చేస్తున్న కృషికి చక్కటి గౌరవం లభించిందని తెలియజేసారు.