ఇంట్లో ఆదాయం తగ్గుతుందా.. కరెంటు పొదుపు చేయకపోవడం..
ఇంట్లో ఆదాయం తగ్గుతుందా.. కారణం ఇవే. సింక్‌లో పాత్రలు వుండటం. ఇంట్లో స్త్రీలు దీపం వెలిగించకపోవడం.. పురుషులు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఆదాయం తగ్గుతుంది. అలాగే ఇంట్లో జుట్టు పడి వుండటం.. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వంటివి ఆదాయాన్ని తగ్గిస్తుంది.
బుధ, శనివారాలు తప్ప మిగిలిన రోజుల్లో పురుషులు తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పైపుల్లో నీరు కారుతుండటం.. గోడపై తేమ వుండటం.. చీమలు గోడపై వుండటం ఆదాయాన్ని తగ్గిస్తుంది.
ఆహారాన్ని వృధా చేయడం.. ఉప్పు, పాలు, పంచదార, బియ్యం వంటి వస్తువులు అయిపోయేంతవరకు వుంచడం.. కరెంటు పొదుపు చేయకపోవడం.. కనీస వెలుతురు లేకుండా చీకట్లో ఉండడం వంటివి ఆదాయాన్ని తగ్గిస్తాయి.