శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-07-2023 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Sagitarus
మేషం :- వృత్తులు వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలుంటాయి. కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరత్రా సాయం అర్ధిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. 
 
వృషభం :- స్త్రీల ప్రతిభకు తగిన అవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. జీవితభాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయండి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. సంతానం పై చదువుల కోసం చేసే యత్నం ఫలిస్తుంది.
 
మిథునం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
కర్కాటకం :- ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. మీ ఉన్నతినిచూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.
 
సింహం :- కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి.
 
కన్య :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉపాధ్యాయులకు చికాకులు తలెత్తుతాయి. ఏ యత్నం కలిసిరాకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తాయి. దైవ కార్యాలల్లో పాల్గొంటారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి.
 
తుల :- ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు.
 
వృశ్చికం :- విద్యాసంస్థలలోని వారికి అనుకూలంగా వుండగలదు. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- విదేశీయానం, రుణ యత్నాల్లో చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
మకరం :- లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.
 
కుంభం :- ఆర్ధికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారుల మధ్య నూతన పరిచయాలు లాభిస్తాయి. పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది.