సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 9 జులై 2023 (10:00 IST)

09-07-2023 ఆదివారం రాశిఫలాలు - వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు...

Virgo
మేషం :- స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశం కలిసివస్తుంది. దూర ప్రయాణాల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
వృషభం :- దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు.
 
మిథునం :- ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంతో శ్రమించిన మీదట గాని అనుకున్న పనులు పూర్తి కావు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
కర్కాటకం :- నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పొదుపు చేయాలనే ప్రయత్నము ఫలించదు. కిరణా, ఫాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థునులు ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
సింహం :- రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించడంతో వారి ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య :- సన్నిహితుల సహాయంతో పనులు చక్కదిద్దుతారు. ఒక స్థిరాస్తి అమ ర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లుతప్పవు.
 
తుల :- ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
 
వృశ్చికం :- మీ జీవితం మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు తారుమారవుతాయి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ఏ యత్నం కలిసిరాకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. విందులలో పరిమితి పాటించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
ధనస్సు :- సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సభా సమావేశాలలో పాల్గొంటారు.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగాఖర్చు చేస్తారు.
 
కుంభం :- ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకున్నది సాధించగలమన్న ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి
 
మీనం :- స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొజ్జెల రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.