మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-07-2023 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...

Capricorn
మేషం :- నూతన కార్యక్రమాలు వాయిదాపడుట మంచిదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైన అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. దూరప్రయాణాలలో అపరిచితులపట్ల మెళకువ అవసరం.
 
వృషభం :- వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలువస్తాయి. ధనాన్ని మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. రిప్రజెంటే‌టివ్లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు.
 
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిష్టలకు కొంత విఘాతం కలిగే అవకాశంఉంది. వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. బంధుమిత్రుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది. మీ సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. శనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు.
 
సింహం :- గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం వస్తువులను చేజార్చుకుంటారు. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ అంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్సు, చిట్స్ రంగాల్లో వారికి ఓర్పు చాలా అవసరం.
 
తుల :- విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. భాగస్వామిక చర్చలు ఆర్ధాంతంగా ముగుస్తాయి. సమావేశాలలో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- ఉద్యోగ, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. గృహనిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి అధికమవుతుంది. పాత రుణాలు చెల్లిస్తారు. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీలకు సంభాసించునపుడు మెళుకువ అవసరం.
 
కుంభం :- ఆటోమోబైల్, ట్రాన్స్‌పోపోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి.
 
మీనం :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. మీ శ్రమ, సమర్థతలకు తగిన గుర్తింపు. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలు కాగలవు.