సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-07-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

Sagitarus
మేషం :- ఉత్తర ప్రత్యుత్తరాలు లాభదాయకం. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. కష్టకాలంలో బంధువులు అండగా నిలుస్తారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది.
 
వృషభం :- సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మిథునం :- రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. స్థిర చరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. అనుకున్న పనులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఇతరుల విషయాలకు, హామీలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కర్కాటకం :- చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. క్రయ విక్రయదార్లకు యోగప్రదంగా ఉండగలదు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును.
 
సింహం :- ఆర్థిక లాభాలు అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో ఆదరణ, ప్రయత్నం, కార్యసిద్ధి ఆలోచనలు కలసివస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని ఓర్పు, ఏకాగ్రత అవసరం. కొత్త ఊహలలో కష్టమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు పురోవృద్ధి. రాత పరీక్షల యందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు.
 
కన్య :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. రాజకీయ పారిశ్రామిక రంగాలవారికి యోగదాయకం.
 
తుల :- ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవిజ్ఞుల సలహా పాటించండి. విద్యార్థులకు రెండవ విడత కౌన్సెలింగ్ అనుకూలం. వృత్తుల వారకి శ్రమాధిక్యత మినహా ఆదాయ సంతృప్తి ఉండదు. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగి ఉన్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
మకరం :- ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం. గతస్మృతులు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి.
 
కుంభం :- బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షిణ తప్పదు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
మీనం :- అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్ధులకు దూర ప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలకమైన వ్యవహరాల్లో మీ జీవితభాగస్వామి సలహా ఎంతగానో ఉపకరిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.