గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-06-2023 బుధవారం రాశిఫలాలు - విద్యాగణపతిని ఆరాధించిన సంకల్ప సిద్ధి

Pisces
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
మిథునం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ అధికంగా ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. కళా, ఫోటోగ్రఫి ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాల వారికి అనుకూలం సమయం.
 
కర్కాటకం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. బకాయిల వసూలులో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంతో చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. బంధువుల చేయూతతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
 
కన్య :- శారీరక శ్రమ, మానసి కాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు.
 
తుల :- మీ ఉన్నతిని చూసి ఇతరులు అపోహపడే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణపనులలో ఏకాగ్రత ముఖ్యం. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ యత్నాల్లో సఫలీకృతులవుతారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు.
 
వృశ్చికం :- విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దైవ సేవా, పుణ్య కార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పాత మిత్రుల కలయికతో గతఅనుభవాలు జ్ఞప్తి చేసుకుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో చికాకులు, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు.
 
ధనస్సు :- వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. వాహన యోగం పొందుతారు. స్త్రీలకు బోగస్ ప్రకటనలు, స్కీముల పట్ల అప్రమత్తత అవసరం. మీ సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయసలహా స్వీకరిస్తారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 
 
మకరం :- బంధువుల మద్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రావలసిన ధనం అందినాదానికి తగినట్టుగానే ఖర్చులుంటాయి. లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తప్పవు.
 
కుంభం :- ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యములో జాగ్రత్త వహిస్తారు.
 
మీనం :- దంపతుల మధ్య దాపరికంమంచిది కాదు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.