గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-06-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Pisces
మేషం :- ముఖ్యుల రాకపోకలు, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్సు, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు.
 
వృషభం :- ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏసీ కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. పెద్ద మొత్తం ధనసహాయం క్షేమం కాదు. 
 
మిథునం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తి విక్రయించాలన్న మీ ఆలోచన విరమించుకోవటం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పటతప్పవు.
 
తుల :- బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వస్తువు కొనుగోలులో నాణ్యత గమనించాలి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
ధనస్సు :- ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు. అధికమవుతున్నారని గమనించండి. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు వంటి సమస్యలు తప్పవు.
 
మకరం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానులు అపోహలు తలెత్తుతాయి. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది.
 
కుంభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో మొహమ్మాటాలు, భేషజాలు తగదు. పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలుతలెత్తుతాయి.
 
మీనం :- బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు సంపాదన పట్లఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది.