1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Chaitra Amavasya 2026: Date, time, rituals and significance

చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్

Chaitra Amavasya 2026
Chaitra Amavasya 2026
చైత్ర అమావాస్య రోజున జీవహింస చేయకుండా.. శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే శుక్రవారం (ఏప్రిల్ 17)న వచ్చే చైత్ర అమావాస్య రోజున మూగ జీవులకు ఆహారం అందించడం వల్ల కర్మ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
అలాగే చీమలకు పంచదార కలిపిన పిండిని చల్లడం ద్వారా సర్పదోషాలు.. ముఖ్యంగా కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. అసలే ఎండాకాలం కావడంతో ఈ రోజున పేదలకు చల్లని నీరు నింపిన కుండలు అంటే.. చలివేంద్రం ఏర్పాటు వంటివి చేయడం మంచిది. 
 
సత్తుపిండి, గొడుగులు లేదా కాలానుగుణంగా దొరికే పుచ్చకాయలు వంటి పండ్లను దానం చేయాలి. అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేయడం వల్ల పితృ దోష తీవ్రత తగ్గుతుంది. 
 
నువ్వులు కలిపిన నీటిని పితృ దేవతలకు అర్పిస్తూ వారిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు తృప్తి చెంది వారసులకు సుఖశాంతులను ప్రసాదిస్తారు. ఇంకా పితృదోషాలు తొలగిపోతాయి. అంతేగాకుండా.. ఏప్రిల్ 17న రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. 
 
దీనితో పాటు ఉదయం 6:29 గంటల నుండి మధ్యాహ్నం 12:02 గంటల వరకు 'అమృత సిద్ధి యోగం' కూడా తోడవనుంది. ఈ రెండు యోగాల కలయిక వల్ల పితృ తర్పణాలు ఇచ్చే వారికి, దాన ధర్మాలు చేసే వారికి అపారమైన పుణ్య ఫలం లభిస్తుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?