మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (09:11 IST)

05-10-2018 - శుక్రవారం దినఫలాలు - వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన..

మేషం: ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. స్త్రీలకు అపరిచిత

మేషం: ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం.
 
వృషభం: వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. మీ సోదరుని మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. నిర్మాణ పథకాలలో మెళకువ వహించండి. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.   
 
మిధునం: భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. 
 
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి పనిభారం పెరుగుతుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహానం ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల సమర్థత, సీనియారిటికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తలెత్తుతాయి. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది.  
 
సింహం: రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గత విషయాలు జ్ఞాప్తికి రాగలవు. 
 
కన్య: మిత్రులు మీ నుండి ధన సహాయం కోరవచ్చు. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రచయితలకు, పత్రికా రంగాలలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.   
 
తుల: ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించన ఖర్చుల వలన చేబదుళ్ళు తీసుకోక తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో ఆటంకాలు తప్పవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.  
 
వృశ్చికం: ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.  
 
ధనస్సు: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. గృహోపకరణ వ్యాపారాలు వేగంగా జరుగుతాయి. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. 
 
మకరం: ఉద్యోగం ప్రమోషన్, ఇంక్రిమెంటు వంటి శుభవార్తులు అందుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.  
 
కుంభం: ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. గృహ నిర్మాణాలలో స్వల్వ అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సభలు, సమావేశాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  
 
మీనం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వాదోపదాలకు, హామీలకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి.