శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (20:16 IST)

దసరా 9 రోజులు దుర్గమ్మను ఎలా పూజించాలి?

దసరా నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

దసరా నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజులలో అమ్మ తమను చల్లగా చూడాలని, చేపట్టిన పనులలో విజయం అందించాలని కనకదుర్గమ్మను భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ తొమ్మిది రోజులు పూజలో ఎలాంటి పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందో తెలుసుకుందాం.
 
నవరాత్రుల్లో అమ్మవారిని ఎలాంటి పువ్వులతో పూజించాలో తెలుసుకుని పూజించాలి. సంపెంగ, మందారం, కదంబం మొదలైన పువ్వులతో పూజించాలి. మల్లెలు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మంచి గంధం, అగరు, కర్పూరం వంటి షోడశోపచారములతో పూజ చేయాలి. అలాగే కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తర శతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో తొమ్మిది రోజుల పాటు అమ్మను ఏకాగ్రమైన మనస్సుతో  పూజించాలి. 
 
ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజించేవారికి సకలసంపదలు చేకూరడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయి. సంసారిక జీవితమును సుఖసంతోషములతో గడుపుతారు. ఎలాంటి బాధలకూ లోనుకారు. పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం చెయ్యాలి. పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై నిద్రించాలి, బ్రహ్మచర్యం పాటించాలి.